గతం ఒక ఙ్ఞాపకం

నేడు ఒక ప్రశ్నార్ధకం

భవిష్యత్తు ఒక కల

అదే జీవితం ...

Friday, March 18, 2011

నువ్వే నువ్వే

ప్రియా...
నువ్వే నా అలోచన
నువ్వే నా కదలిక
నువ్వే నా కల
నువ్వే నా ఊపిరి
నువ్వే నా ఇష్టం
నువ్వే నా ప్రేమ
నువ్వే నా సర్వస్వం
నన్ను నమ్ము చెలీ!
నువ్వే నువ్వే
నా అణువణువు
నిండి వున్నావు..
నువ్వు లేని
నా జీవితం
అక్షరాలు లేని పుస్తకం
వాసన లేని పువ్వు
ప్రాణం లేని శరీరం...
అందుకే మల్లీ నువ్వు అడుగకు
నేను నిన్ను ప్రేమిస్తున్నాన అని...
అలా అడిగితే
నా ఊపిరి
ఆగిపోతుంది...

ఊపిరి

నిరాశ నిస్పౄహలతో నేను నిస్తేజమైన వేళ
ఆశలా నవ్వించింది నీ తలపు

ఎండమావులకై పరుగు తీసిన వేళ
సెలయేరై సేద తీర్చింది నీ పలుకు

నా మనసు అలోచనలతో అలసిన వేళ
అమౄత హస్తమై ఆదరించింది నీ స్పర్ష

కదలిక లేని శవం లాంటి నా హౄదయంలో
నీ పెదవుల స్పర్ష జీవం పోసింది

కాని చెలీ!

నాలో కలిగే స్పందన నీలో లేదని తెలిసి
నీ హౄదయం శిల లాంటి కఠినమైనదని తెలిసి
నా ఊపిరి ఆగిపొయింది.....

నరకం (1)

చెలీ!
నువ్వు నా దానివి అనుకున్నాను
నిన్ను నా గుండెల్లో ప్రతిష్టించుకున్నాను
నా ప్రేమ దేవతగా పూజించుకున్నాను
నీ సంతోషమే నా సంతోషమనుకున్నాను
నీ భాధే నా భాధ అనుకున్నాను..
నువ్వే నా సర్వస్వం అనుకున్నాను...
కానీ నీ మనసులో నేను లేనని తెలిసి
నా మనసు మూగపోయింది
నా హౄదయం పగిలి పోయింది...
అయినా ప్రియా!
ప్రతి చిరు నవ్వు దుఃఖానికి
ప్రతి వెలుగు చీకటికి
ప్రతి కలయిక ఎడబాటుకి
ప్రతి ప్రేమ త్యాగానికి
నాంది అయినట్లు..
మన ఎడబాటు నీకు సంతోషాన్నిస్తే
అంతకన్న నాకు కావల్సింది ఏముందీ
అది నన్ను నరకంలోకి నెట్టేసినా...

పుష్పాంజలి

నా జీవితాన
చీకటి సంధ్యలు ముసిరిన వేళ
నిండు చందమామలా అడుగిడి
వెన్నెల వెలుగులు కురిపిస్తున్నావు

నా బ్రతుకున
కారు మబ్బులు కమ్మినవేళ
తటిల్లతలా మెరిసి
చీకటి మబ్బులు
తరిమి కొడుతున్నావు

నా గుండె
మోడువారి శిథిలమవుతున్నవేళ
ఆమనిలా వచ్చి
ప్రేమ జల్లులు కురిపిస్తున్నవు

నా జీవన పయనం
దారి తెలియక స్తంబించినవేళ
వేగుచుక్కలా ఉదయించి
మార్గదర్శనం ఇస్తున్నావు

ఇంతలా నాలో
కలిసిన ఎవరు నువ్వు..
నా ప్రేమ తపస్సుకి మెచ్చి
ఆ దేవుడు పంపిన దేవకన్యవా..
లేక నా కోసం ఈ దివిలో
వెలసిన ప్రేమ దేవతవా..
నీవెవరివైనా ఇవే నీకు నా
ప్రేమ ప్రణయ పుష్పాంజలి

ఎదురుచూపు

చెలీ!
విరహమంటే ఎమిటో తెలిసింది
నీతో గడపని ఈ కొన్ని రోజుల్లో
నిన్ను విడిచి వుండలేనని అర్థమైంది
ఈ చిరు ఎడబాటులో
ప్రతి రోజు రాత్రి
నీవు నా పక్కనే వున్నావని
కలగంటాను
ఉదయాన్నె
కళ్ళు తెరిస్తే నా కల ఎక్కడ
చెదిరిపోతుందో అని కళ్ళు తెరవను
ఎక్కడ అలికిడి అయినా
నీవేమోనని ఆశతో చుస్తుంటాను
నీతో మాట్లాడాలని
నీ మాటలు వినాలని
నిన్ను నా కౌగిలిలో బంధించాలని
ఎదురుచూస్తుంటాను
ప్రతి క్షణం...
ప్రతి రోజూ...
నీ ప్రేమకై తపిస్తూ
నీ అనురాగపు జ్ఞాపకాలలో తడిసిపోతూ
పొద్దున్నే ఎప్పుడు నిన్ను
నా చిరు ముద్దుతో లేపుతాను అని ఎదురుచూస్తున్నాను

గుండె గుడి

చెలీ!
దివినుండి భువికి దిగిన దేవ కన్యలా
తెల్ల చేరలో నీవు
నా కళ్ళలో నిలిచిపొయావు
చీరలో నీ అందం
నన్ను పరవశున్ని చేసింది
ఎంతందంగా వున్నావొ
నేనెలా వర్ణించను
నిన్ను చూసి చందమామ
అసూయతో మబ్బుల చాటుకు వెళ్ళింది
నిన్ను చూసి కలువ భామ
సిగ్గుతో నీళ్ళలో దాక్కుంది
అరవిరిసిన ముగ్ద మనోహరమైన నీ రూపం
విరిసిన మందారం లాంటి నీ లావణ్యం
అప్పుడే విచ్చిన మల్లె లాంటి నీ చిరునవ్వు
నేనెలా మర్చి పోగలను
నా హౄదయంలో నీ రూపాన్ని నింపుకోవడం తప్ప
నిన్నెలా నేను పొందగలను
ప్రియా!
నిన్ను నా గుండె గుడిలో ప్రతిష్టించుకోవడం తప్ప

ఆ(త్యా)శ

నా బంగారం
నిండు పున్నమి వెన్నెలలో
సముద్రపు ఒడ్డున ఇసకపై నీతో కలిసినడవాలని ఆశ
చల్లని వెన్నల రాతిరిలో
మేడపైన దుప్పటి పర్చుకొని నీ పక్కన పడుకోవాలని ఆశ
మంచి రొమాంటిక్ సినిమాని
నీ పక్కన కూర్చుని
నీ చేతిలొ చేయి వేసి చూడాలని ఆశ
బయట వర్షం పడుతుంటే
నీ పక్కనే కూర్చొని పకోడిలు తినాలని ఆశ
ఎండాకాలం సాయంత్రం
ఆరుబయట మెట్ట్లపై కూర్చొని రొజూ నీతో మాట్లాడాలని ఆశ
ఆరుబయట మంచు పడుతుంటే
దుప్పట్లో నిన్ను హత్తుకొని నీ పక్కన పడుకోవాలని ఆశ
మనసు బాగోలేనప్పుడు
నీ ఒల్లో తల పెట్టుకొని పడుకోవాలని ఆశ
నా ముద్దుల బంగారం!
నా జీవితపు చివరి అంకం వరకు
నువ్వు నాతో వుండాలని ఆ(త్యా)శ....